టీమిండియా ఓపెనర్లపై ఏమాత్రం ప్రభావం చూపని పాక్ బౌలర్లు

  • రోహిత్ శర్మ ఫిఫ్టీ
  • ఆచితూచి ఆడుతున్న రాహుల్
  • టీమిండియా స్కోరు 17 ఓవర్లలో 99/0
చిరకాల ప్రత్యర్థుల సమరంలో టీమిండియాకు శుభారంభం లభించింది. మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. అయితే, పాకిస్థాన్ పేసర్లు అమీర్, వాహబ్ రియాజ్, హసన్ అలీ కొత్తబంతితో భారత్ కు ఎలాంటి సమస్యలు సృష్టించలేకపోయారు. ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మ దూకుడుగా ఆడగా, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును నడిపించారు. రోహిత్ 34 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 17 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 99 పరుగులు. రోహిత్ శర్మ 60, రాహుల్ 36 పరుగులతో ఆడుతున్నారు.
Go Back to Shorts
Cricket
India
Pakistan

More Telugu News